మోడీని కలిసిన కామన్వెల్త్ పతక విజేతలు

మోడీని కలిసిన కామన్వెల్త్ పతక విజేతలు

ఢిల్లీ:ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత విజేతలు ప్రధాని నరేంద్రమోడీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరిగిన 21వ కామన్వెల్త్ క్రీడల్లో బాక్సింగ్ విభాగంలో ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన బాక్సర్ హుసాముద్దీన్ 56 కేజీల వ్యక్తిగత శరీర బరువు కేటగిరీలో తలపడి కాంస్య పతకాన్ని సాధించాడు. భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు 9 పతకాలు సాధించగా.. అందులో హుసాముద్దీన్ క్యాంస పతకాన్ని సాధించడం గమనార్హం. ఆనవాయితీలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడీని సోమవారం ఢిల్లీలో కలిశారు. విజేతలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపి ప్రశంసించారు.

 

Back to Top