ధర్మపోరాటంలో మాదే విజయం:చంద్రబాబు

- April 30, 2018 , by Maagulf
ధర్మపోరాటంలో మాదే విజయం:చంద్రబాబు

తిరుపతి:నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం చేస్తున్నామని, ధర్మ పోరాటంలో తామే విజయం సాధిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.నీతిమాలిన పార్టీలకు మద్దతిస్తూ కేంద్రం ఏం సంకేతాలిస్తోందని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఇతర హమీలను తిరుపతి సాక్షిగా మోడీ ఇచ్చిన హమీలను ధర్మపోరాట సభలో టిడిపి విన్పించింది. 2014 ఎన్నికల సమయంలో తిరుపతి వేదికగా మోడీ ఇచ్చిన హమీల సీడీలను ఈ సభ ద్వారా విన్పించారు.

2014 ఎన్నికల సమయంలో తిరుపతి వేదికగా బిజెపి ఇచ్చిన ఎన్నికల హమీలను విస్మరించిందని ఆరోపిస్తూ టిడిపి ఆధ్వర్యంలో సోమవారం నాడు ధర్మపోరాట దీక్షను నిర్వహించారు. ఈ దీక్షలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహనికి నివాళులర్పించారు. టిడిపికి చెందిన పలువురు నేతలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.


అంతిమ విజయం మాదే
నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై తాము ధర్మ పోరాటం చేస్తున్నట్టుగా చంద్రబాబునాయుడు చెప్పారు. నాలుగేళ్ళు గడిచినా ఇచ్చిన హమీలను కేంద్రం అమలు చేయలేదన్నారు. నాలుగేళ్ళ క్రితం మోడీ ఇచ్చిన హమీలను గుర్తు చేయడంతో బిజెపి చేసిన నమ్మకద్రోహన్ని ప్రజలకు వివరించేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్టు చెరప్పారు. ధర్మపోరాటంలో విజయం సాధిస్తానని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com