సౌదీ అరేబియా లో 'డిస్నీల్యాండ్'ని ప్రారంభించిన కింగ్ సల్మాన్
- April 30, 2018
సౌదీ అరేబియా:వినోదభరితమైన కార్యక్రమాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది సౌదీ అరేబియా. దీనిలో భాగంగా త్వరలోనే డిస్నీల్యాండ్‌ను ప్రారంభించనుంది. ఈ "వినోదం నగరం" 334 చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించబడుతుంది. దీనిలో థీమ్ పార్కులు, సఫారి మైదానాలు, మోటర్ స్పోర్ట్స్ లాంటి సౌకర్యాలను కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్టును సౌదీ అరేబియా యొక్క పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ద్వారా నిధులు సమకూరుస్తున్నారు. ఈ నెల 28వ తేదీన సాయంత్రం ప్రారంభోత్సవ వేడుక నిర్వహించారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రవేశపెట్టిన భారీ విప్లవాత్మకమార్పుగా భావించవచ్చు.
సౌదీ అరేబియాకు చెందిన కింగ్ సల్మాన్. రియాద్ సమీపంలో ఈ "వినోద నగరం" నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇది కొత్త ఆర్థిక వ్యవస్థను ఆవిష్కరించడానికి, రాజధానిని విస్తరించడానికి మరోప్రయత్నంగా చెబుతున్నారు. డిస్నీల్యాండ్ మాదిరిగానే రూపొందించబడిన ఈ ప్రాజెక్ట్, సుమారు 334 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ స్థలంలో విస్తరించనున్నారు. థీమ్ పార్కులు, మోటార్ వెహికల్ గేమ్స్ సదుపాయాలు, సఫారీ ట్రిప్స్ అన్ని ఒకే ప్రాంతంలో ఉంటాయి. ఈ ప్రాజెక్టును 2030 నాటికి 17 మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షించాలని భావిస్తోన్నారు. "విజన్ 2030"లో భాగంగా అధికారులు మొదటి సినిమా థియేటర్లను తెరవాలని నిర్ణయించుకున్నారు దీంతో దేశంలో ఈ వినోద సౌకర్యాలపై 35 ఏళ్లుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. 250 సీట్లు ఉన్న సినిమా హాల్‌లో మొదటగా "బ్లాక్ పాంథర్" సినిమాను ప్రదర్శించారు.
తాజా వార్తలు
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్
- తిరుమల భక్తులకు శుభవార్త..
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!







