ఉద్యోగాలపేరుతో మోసం..

ఉద్యోగాలపేరుతో మోసం..

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్‌ సీసీఎస్ సైబర్ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తామని చాంద్రాయణగుట్టకు చెందిన ఆయూబ్‌ ను  ఈ ముఠా మోసం చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫోన్‌ కాల్స్ వచ్చిన టవర్ లోకేషన్ ఆధారంగా నిందితులను గుర్తించారు. హర్యానాకు చెందిన గుంజన్, వినయ్, తరుణ్‌ జ్యోత్‌ కౌర్‌లను అరెస్ట్‌ చేసి, రిమాండ్‌ కు తరలించారు. అలాగే వీరి అకౌంట్స్ సీజ్ చేసి, డెబిట్, క్రెడిట్‌ కార్డులు, సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Back to Top