'తేజ్ ఐ లవ్ యూ' టీజర్ విడుదల
- April 30, 2018
సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో కరుణాకరన్ తెరకెక్కిస్తున్న చిత్రం తేజ్ ఐ లవ్ యూ. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కవితాత్మక భావనలతో సాగే ప్రేమ కథాచిత్రంగా ఈ మూవీ ఉంటుందని తెలుస్తుండగా, ఇందులో సాయిధరమ్ తేజ్ నవతరం ప్రేమికుడిగా కనిపించనున్నాడు. అనుపమ పరమేశ్వరన్ అందంతో పాటు చక్కటి అభినయంతో ఆకట్టుకుంటుంది. కుటుంబ అనుబంధాలు మేళవించిన ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అందరిని మెప్పిస్తుందని నిర్మాతలు అన్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తి కాగా, ప్రస్తుతం పారిస్‌లో పాటల్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం . మేడే సందర్భంగా చిత్ర టీజర్ విడుదల చేశారు. ఇది సినిమాపై అంచనాలు పెంచుతుంది. ఈ నెలలోనే మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. మరి తాజాగా విడుదలైన టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- జూన్ 30న ఇండియన్ ఎంబసీ 'ఓపెన్ హౌస్' కార్యక్రమం
- సెయింట్ లూయిస్‌లో అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం
- 2022 తొలి మూడు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల పెరుగుదల
- జీసీసీ జాతీయులకు వీసా విషయమై వెసులుబాటు కల్పించనున్న యూకే
- తెలంగాణ కరోనా అప్డేట్
- జూలైన్ 9న ఈద్ అల్ అదా
- వంశీ-శుభోదయం పురస్కారాలు..
- ఆన్లైన్ మోసం: గుట్టు రట్టు చేసిన రాయల్ ఒమన్ పోలీస్
- ఫ్యామిలీ, టూరిస్ట్ విజిట్ వీసాలపై కువైట్ కీలక నిర్ణయం..!
- అంబానీ సంచలన నిర్ణయం