జ్యోతికతో నటించే ఛాన్స్.. ఈ నంబర్‌కు కాల్ చేయండి
- May 01, 2018తమిళ చిత్రం 'నాచ్చియార్' తరువాత జ్యోతిక నటించబోతున్న చిత్రం 'కాట్రిన్ మొళి'. సామాజిక స్పృహతో సినిమాలు తీస్తారన్న పేరు సంపాదించిన సీనియర్ దర్శకుడు రాధామోహన్ తెరకెక్కించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. హిందీలో విద్యాబాలన్ ప్రధానపాత్రలో ఘన విజయం సాధించిన 'తుమ్హారీసులు' చిత్రానికి రీమేక్ ఇది. కథ ప్రకారం జ్యోతికకు కవలలైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉంటారు. ఆ పాత్రల్లో నిజమైన కవలలనే నటింపజేయాలని రాధామోహన్ నిర్ణయించారు. హిందీలోనూ ప్రత్యేకంగా అన్వేషించి కవల సోదరీ మణులను పట్టుకున్నారు. ఇప్పుడు తమిళ వెర్షన్ కోసం 35 నుండి 45 ఏళ్లలోపు ఉన్న కవల సోదరీమణులను వెతుకుతున్నారు. సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కలిగిన కవలు 98408 41150 వాట్సాప్ నెంబరు ద్వారా తమను సంప్రదించవచ్చని 'కాట్రిన్ మొళి' చిత్ర బృందం ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!