హీరో 'నానీ'కి బంపర్ ఆఫర్

- May 01, 2018 , by Maagulf
హీరో 'నానీ'కి బంపర్ ఆఫర్

తక్కువ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ సూపర్ హిట్ లను కైవసం చేసుకున్నారు నాచురల్ స్టార్ నాని.. కెరీర్ పీక్ దశలో ఉండగానే మరో బంపర్ ఆఫర్ కొట్టేశాడు నాని. అలనాటి మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మహానటి' సినిమాలో నాని   ఎన్టీఆర్ గా కనిపించనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం స్పష్టం చేసింది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై ఫైనల్ దశకు వచ్చిన ఈ సినిమాపై  భారీ అంచనాలే ఉన్నాయి. అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో ఇప్పటికే నాగచైతన్య నటిస్తుండగా.. ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తారని అందరూ ఊహించారు కానీ అనూహ్యంగా నాని పేరు తెరపైకి వచ్చింది. కీలక పాత్ర అయిన సావిత్రి పాత్రను నటి కీర్తి సురేష్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల కిందట  రిలీజ్ అయినా టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా మే 1 వ తేదీన మహానటి ఆడియో వేడుక జరగనుంది. ఈ వేడుకకు అతిరధ మహారథుల తోపాటు టాలీవుడ్ కీలక నటీనటులు హాజరవనున్నట్టు తెలుస్తోంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com