బ్రెజిల్లో కూలిన భారీ భవనం
- May 01, 2018బ్రెసిలియా: బ్రెజిల్లో బహుళ అంతస్తుల భవనంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆ కట్టడం కుప్పకూలగా కొందరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. షావుకోలోని ఓ నగరంలోని ఆకాశహార్మ్యంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే తీవ్రరూపం దాల్చిన మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తుండగా భవనం మొత్తం కుప్పకూలింది. అధికారులు అదనపు సిబ్బందిని మోహరించి సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రమాదానికి గురైన భవనం ఒకప్పుడు బ్రెజిల్ పోలీసు శాఖ ప్రధాన కార్యాలయం. చాలాకాలంగా ఖాళీగా ఉన్న ఆ భవనంలో కొందరు అక్రమంగా నివాసముంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఎంతమంది ఉన్నారు వారి పరిస్థితి ఏమిటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం