కల్పనా చావ్లాకు ట్రంప్ ప్రశంసలు
- May 01, 2018
అంతరిక్ష పరిశోధనల కోసం జీవితాన్ని అంకితం చేసిన భారత సంతతి వ్యోమగామి కల్పనాచావ్లా అమెరికా వీర మహిళ అని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. వ్యోమగాములు కావాలని లక్షల మంది బాలికల్లో ఆమె స్ఫూర్తి నింపారని ప్రశంసించారు. ఏటా మే నెలను ఆసియా -పసిఫిక్ అమెరికా వారసత్వ మాసంగా ప్రకటిస్తూ వాషింగ్టన్‌లో ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కల్పనాచావ్లా రోదసీలోకి వెళ్లిన తొలి భారత సంతతి మహిళ అని.. స్పేస్ షటిల్ సహా వేర్వేరు ప్రయోగాల కోసం ఆమె అంకిత భావంతో పనిచేశారని ట్రంప్ అన్నారు.
తాజా వార్తలు
- ఫిలిఫ్పీన్స్లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ..
- దుబాయ్ లో ఘనంగా యూఏఈ 52వ నేషనల్ డే వేడుకలు
- యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకల కోసం ట్రాఫిక్ రూల్స్ జారీ
- హైదరాబాద్ నుండి గోండియాకు విమాన సర్వీసులు ప్రారంభం
- ప్రభుత్వ సెలవు దినాల్లో మూడు ఎమిరేట్స్లో ఉచిత పార్కింగ్
- AFC ఆసియా కప్ ఖతార్ 2023 మస్కట్ల ఆవిష్కరణ
- యువరాజు మమదూహ్ బిన్ అబ్దుల్ అజీజ్ అంత్యక్రియల ప్రార్థనలో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్
- అవినీతి నిరోధక శాఖ అదుపులో 146 మంది
- ఒమన్, స్విట్జర్లాండ్ మధ్య కీలక ఒప్పందాలు
- నాలుగు రాష్ట్రాల్లో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..