గాలివానకు అల్లకల్లోలమైన ఏ.పి
- May 01, 2018
అమరావతి:ఈదురు గాలులు, అకాలవర్షంతో ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలమయ్యింది. కోస్తాంధ్ర జిల్లాల్లో మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. విజయవాడ, అమరావతి, గుంటూరుల్లో అయితే.. సాయంత్రం నాలుగింటికే చీకట్లు కమ్ముకున్నాయి. దట్టమైన మేఘాలు అలుముకోవడంతో పాటు పలుచోట్ల పిడుగులు కూడా పడడంతో జనం భయాందోళనకు గురయ్యారు.
అమరావతి సచివాలయ ప్రాంతంలో సాయంత్రమే చీకటైపోయింది. దట్టమైన మేఘాలు ఒక్కసారిగా కమ్మేయడంతో.. అమరావతి ప్రాంతమంతా అంధకారంలోకి వెళ్లిపోయింది. ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురవడంతో సచివాలయం దగ్గర ఉన్న వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గుంటూరులోనూ ఇదే పరిస్థితి. ఉరుముల శబ్దాలతో నగరమంతా హోరెత్తిపోయింది. పిడుగులు పడుతుండడంతో జనం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈదురు గాలులు, వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేయడంతో.. గుంటూరు అంతా చీకటిమయం అయ్యింది.
పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులకు పెదవేగి మండలంలో తాటి చెట్టు విరిగిపడింది. రోడ్డుపై వెళ్తున్న బైక్‌పై పడడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. జంగారెడ్డి గూడెంలో మామిడి, జీడిమామిడి తోటలతో పాటు, పొగాకు, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది.
ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పిడుగులు ఉధృతంగా పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పార్వతీపురం, కురుపాం, గజపతినగరం, ఇచ్చాపురం, పలాస, ఆమదాలవలస, శ్రీకాకుళంలోనూ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. విశాఖలో మధ్యాహ్నానికి వర్షం తగ్గడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
తాజా వార్తలు
- తెలంగాణ కరోనా అప్డేట్
- టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా సింగిరెడ్డి నరేష్ రెడ్డి
- ఈద్ అల్ అదా 2022: చూచాయిగా తేదీ వెల్లడి
- కిడ్నాప్ కేసులో పది మంది అరెస్ట్
- సబ్ కాంట్రాక్టర్కి 50,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాలని ఆదేశం
- ఖతార్: త్రీడీ ప్రింటింగ్ ద్వారా భవిష్యత్తులో రోబోలు ఆసుపత్రుల్ని నిర్మించవచ్చు
- తొలి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన సౌదీ, హువావే
- తెలంగాణ డీజీపీ ఫొటోతో జనాలకు సైబర్ నేరగాళ్ల వల
- కోవిడ్ నాలుగో డోస్ ప్రకటించనున్న కువైట్
- జూలై నెలలో 14రోజులు బ్యాంకులకు బంద్..సెలవులు