కుప్పకూలిన అమెరికా రక్షణ విమానం..ఐదుగురు మృతి
- May 02, 2018
వాషింగ్‌టన్ : దక్షిణ అమెరికాలోని రక్షణ రంగానికి చెందిన కార్గో విమానం జార్జియాలో కూలడంతో ఐదుగురు వ్యక్తులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సిటీ ఆఫ్ సవన్నా సమీపంలోని విమానాశ్రయం హైవేపై ఈ విమానం కూలిందని, జార్జియా నేషనల్ గార్డ్ ప్రతినిధి డిసిరీ బంబా వెల్లడించారు. ఈ విమానం సి -130 రకానికి చెందిన విమానమని, ప్యూర్టో రికో నేషనల్ గార్డ్ టీమ్ ఈ విమానం సేవలను వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఈ విమానంలో ఉన్న ఐదుగురు వ్యక్తులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదని, వారి వివరాల కోసం ప్రయత్నిస్తున్నామని అధికారి పేర్కొన్నారు. విమాన ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. ట్విటర్‌లో నల్లని పొగతోకూడిన వీడియోలు ప్రసారమవుతున్నాయి.
తాజా వార్తలు
- జూన్ 30న ఇండియన్ ఎంబసీ 'ఓపెన్ హౌస్' కార్యక్రమం
- సెయింట్ లూయిస్లో అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం
- 2022 తొలి మూడు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల పెరుగుదల
- జీసీసీ జాతీయులకు వీసా విషయమై వెసులుబాటు కల్పించనున్న యూకే
- తెలంగాణ కరోనా అప్డేట్
- జూలైన్ 9న ఈద్ అల్ అదా
- వంశీ-శుభోదయం పురస్కారాలు..
- ఆన్లైన్ మోసం: గుట్టు రట్టు చేసిన రాయల్ ఒమన్ పోలీస్
- ఫ్యామిలీ, టూరిస్ట్ విజిట్ వీసాలపై కువైట్ కీలక నిర్ణయం..!
- అంబానీ సంచలన నిర్ణయం