దాసరి సినీ అవార్డుల ప్రకటన

- May 02, 2018 , by Maagulf
దాసరి సినీ అవార్డుల ప్రకటన

ఈ ఏడాది దర్శకరత్న దాసరి నారాయణరావు ఫిల్మ్‌ అవార్డ్స్ విజేతల ఎంపిక ఖరారైంది. అవార్డు గ్రహీతల వివరాలను ఫిలిం ఎనలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ (ఫాస్‌) సంస్థ అధ్యక్షులు.. మాజీ సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు కె. ధర్మారావు వెల్లడించారు. అవార్డులు.. గ్రహీతల వివరాలు ఇలా ఉన్నాయి.

డైరెక్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ : శేఖర్‌ కమ్ముల (ఫిదా)
ఉత్తమ గేయ రచయిత : సుద్దాల అశోక్‌ తేజ
ఉత్తమ గాయని : మధుప్రియ
ప్రశంసా దర్శకుడు అవార్డు : వడ్డేపల్లి కృష్ణ (లావణ్య విత్‌ లవ్‌బాయ్స్‌)
దాసరి ప్రతిభా పురస్కారాలు : సంపూర్ణేష్‌ బాబు, శివపార్వతి, సంగీత దర్శకులు వాసూరావు, మాటల రచయిత సంజీవని 
దాసరి విశిష్ట సేవా పురస్కారం : రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షుడు లయన్‌ డా. ఎ. నటరాజు 
ఫాస్‌-దాసరి కీర్తి కిరిట సిల్వర్‌క్రౌన్‌ అవార్డులు : దర్శకులు కోడి రామకృష్ణ, టీవీ యాంకర్‌ సుమ కనకాల
దాసరి జీవన సాఫల్య పురస్కారం : సూపర్‌హిట్‌ సినీ వార పత్రిక ఎడిటర్‌ అండ్‌ పబ్లిషర్‌ నిర్మాత బీఏ రాజు 

ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఈ నెల 6న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటి జమున హాజరు కానున్నారు. సభాధ్యక్షులుగా కైకల సత్యానారాయణ వ్యవహరిస్తారు. లేడీ డైరెక్టర్‌ జయ. బి సభను ప్రారంభించనున్నారు. సన్మానకర్తగా దర్శకుడు ఎన్‌.శంకర్‌ విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చైర్మన్‌గా రేలంగి నరసింహారావు, ఫెస్టివల్‌ చైర్మన్‌గా లయన్‌ ఎ. విజయ్‌కుమార్‌ వ్యవహరిస్తారు. శ్రీమతి టి. లలితబృందం దాసరి సినీ విభావరి నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com