కుప్పకూలిన అమెరికా రక్షణ విమానం..ఐదుగురు మృతి
- May 02, 2018వాషింగ్‌టన్ : దక్షిణ అమెరికాలోని రక్షణ రంగానికి చెందిన కార్గో విమానం జార్జియాలో కూలడంతో ఐదుగురు వ్యక్తులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సిటీ ఆఫ్ సవన్నా సమీపంలోని విమానాశ్రయం హైవేపై ఈ విమానం కూలిందని, జార్జియా నేషనల్ గార్డ్ ప్రతినిధి డిసిరీ బంబా వెల్లడించారు. ఈ విమానం సి -130 రకానికి చెందిన విమానమని, ప్యూర్టో రికో నేషనల్ గార్డ్ టీమ్ ఈ విమానం సేవలను వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఈ విమానంలో ఉన్న ఐదుగురు వ్యక్తులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదని, వారి వివరాల కోసం ప్రయత్నిస్తున్నామని అధికారి పేర్కొన్నారు. విమాన ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. ట్విటర్‌లో నల్లని పొగతోకూడిన వీడియోలు ప్రసారమవుతున్నాయి.
తాజా వార్తలు
- కాన్సస్లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!