'ట్రంప్'ను నోబెల్ శాంతి బహుమతి వరించనుందా?
May 02, 2018
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(71)ను ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వరించనుందా? ఉత్తరకొరియాతో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించినందుకు గాను రిపబ్లికన్ నాయకులు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ 'నా కర్తవ్యం నేను నిర్వహించాను' అన్నారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంపే అర్హుడని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉత్తరకొరియాతో తాను శాంతినే కోరుకున్నానన్నారు. ఇప్పటివరకూ నలుగురు అమెరికా అధ్యక్షులకి నోబెల్ శాంతి పురస్కారాలు లభించాయి.