హైదరాబాద్:ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఫొటో కాంటెస్ట్
- May 03, 2018హైదరాబాద్:సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఫొటో కాంటెస్ట్ నిర్వహించనున్నామని క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజమౌళి చారి, విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. జూన్ మొదటి వారంలో ప్రెస్‌క్లబ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ పోటీలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీకి చెందిన ఫొటో జర్నలిస్టులు ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఉత్తమ న్యూస్ ఫొటోగ్రాఫ్స్ (8 10 లేక 10 12) సైజులో కనీసం మూడు ఫొటోలను పంపాలని, ఈ నెల 15 వరకు తమ ఎంట్రీలను అందజేయాలని కోరారు. ఫలితాలు జూన్ 1న వెల్లడిస్తామని, మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ప్రత్యేక బహుమతులు కూడా అందజేయనున్నామని తెలిపారు. ఎంట్రీలను hpcphotocontest @gmail. comకు పంపించాలని, ఇతర వివరాల కోసం 8096677372, 99483 34445 లో సంప్రదించాలని వారు కోరారు.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత