మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఆర్‌వోపీ ఎలక్ట్రానిక్‌ కియోస్క్‌లు

- May 04, 2018 , by Maagulf
మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఆర్‌వోపీ ఎలక్ట్రానిక్‌ కియోస్క్‌లు

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, ఒమన్‌ అరబ్‌ బ్యాంక్‌తో కలిసి ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ని ప్రారంభించడం జరిగింది. ఎంక్వయిరీ, స్థానిక జిసిసి అలాగే మున్సిపల్‌ జరీమానాల చెల్లింపుకు ఈ సర్వీస్‌ ఉపయోగపడ్తుంది. సెల్ఫ్‌ సర్వీసెస్‌ కియోస్క్‌ల ద్వారా పేమెంట్‌ ప్రాసెస్‌ సులభతరమవుతుందని అధికారులు అంటున్నారు. మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో మూడు కియోస్క్‌లను ఏర్పాటు చేశారు అధికారులు. డిపాచ్యూర్స్‌ బిల్డింగ్‌ హాల్‌ వన్‌లో ఒకటి, వీసా కాన్సిలేషన్‌ హాల్‌లో మరొకటి, పాస్‌పోర్ట్‌ మరియు ఎలక్ట్రానిక్‌ రటావెల్‌ గేట్స్‌ దగ్గరలో మరొకటి ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనల్ని ఈ కియోస్క్‌ల ద్వారా ప్రయాణీకులు క్లియర్‌ చేసుకోవచ్చు. రెసిడెంట్స్‌ (వలసదారులు) ఐడీ నెంబర్‌నీ, టూరిస్టులు వీసా నంబర్‌ని ఎంటర్‌ చేయడం ద్వారా కియోస్క్‌లను ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com