మొబైల్ ఫోన్ స్కామ్: అబుదాబీలో 11 మంది అరెస్ట్
- May 04, 2018
అబుదాబీ:11 మంది సభ్యులుగల ముఠాని అబుదాబీ పోలీసులు అరెస్ట్ చేశారు. మొబైల్ ఫోన్లకు ఎస్‌ఎంఎస్ పంపి, వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకుని, స్కామ్‌కి పాల్పడుతున్నట్లుగా నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. విలువైన బహుమతులు గెల్చుకున్నారంటూ అమాయకులకు మెసేజ్‌లు పంపి, వారి నుంచి బ్యాంక్ డిటెయిల్స్ తీసుకుని, నిందితులు దోపిడీకి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అల్ అయిన్ పోలీస్ డైరెక్టరేట్ - క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ డైరెక్టర్ కల్నల్ ముబారక్ అల్ సబౌషి మాట్లాడుతూ, తమ బృందం దుబాయ్ పోలీస్‌తో కలిసి 11 మంది నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టయినవారంతా ఆసియా జాతీయులే. వారి నుంచి క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ రిసీప్ట్స్, చెక్‌బుక్స్, ఫోన్ సిమ్‌కార్డ్స్, పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారనీ, వారందర్నీ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించామని కల్నల్ అల్ సబౌషి చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..