శరణార్ధుల్ని పరిశీలించిన బృందం

- December 06, 2015 , by Maagulf
శరణార్ధుల్ని పరిశీలించిన బృందం


అల్‌ మహా మెడికల్‌ బృందం, తనిఖీల్లో భాగంగా టర్కీలోని రెహ్యాన్లిలోగల అల్‌ అమాల్‌ హాస్పిటల్‌ని సందర్శించింది. ఖతార్‌ ఛారిటీ ఈ ఆసుపత్రి ఏర్పాటుకు సహకరించింది. 2016 సంవత్సరానికిగాను ఆసుపత్రికి అవసరమయ్యే సౌకర్యాలు, ముఖ్యంగా మందులు వంటి వాటి గురించి ఈ బృందం అక్కడి వారిని అడిగి సమాచారాన్ని సేకరించింది. సిరియా నుంచి వస్తున్న శరణార్ధుల కోసం ఏర్పాటైన ఒకే ఒక్క హాస్పిటల్‌గా అల్‌ అమాల్‌ ఆసుపత్రి పేరొందింది. ఖతార్‌ ఛారిటీ గడచిన మూడేళ్ళలో 4,000,000 ఖతారీ రియాల్స్‌ని ఈ ఆసుపత్రి కోసం వెచ్చించింది. 2014-2015 సంవత్సరానికిగాను 100,250 సిరియన్స్‌ ఈ ఆసుపత్రిలో లబ్ది పొందారు. సిరియా బోర్డర్‌లో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com