సిరియాలో కూలిపోయిన రష్యా హెలికాప్టర్‌

- May 08, 2018 , by Maagulf
సిరియాలో కూలిపోయిన రష్యా హెలికాప్టర్‌

రష్యాకు చెందిన ఖెఎ-52 హెలికాప్టర్‌ సిరియాలో కూలిపోయిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సిరియన్‌ అరబ్‌ రిపబ్లిక్‌లోని తూర్పు ప్రాంతాల్లో తిరుగుతున్న ఈ హెలికాప్టర్‌ కూలిపోవడంతో అందులో ఉన్న ఇద్దరు పైలెట్లూ మృతి చెందారని ఆ శాఖ పేర్కొంది. సాంకేతిక లోపాల కారణంగానే ఈ హెలికాప్టర్‌ కూలిపోయి ఉంటుందని, సహాయక బృందాలు పైలెట్ల మృత దేహాలను వెలికి తీశాయని ఆ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com