స్వదేశానికి డబ్బు పంపడంలో భారతీయులది మొదటి స్థానం

- May 08, 2018 , by Maagulf
స్వదేశానికి డబ్బు పంపడంలో భారతీయులది మొదటి స్థానం

విదేశాలకు వెళ్లి నాలుగు రాళ్లు సంపాదించి అందులో కొంత మొత్తాన్ని స్వదేశంలోని కుటుంబాలకు పంపగలిగితే ఆ తృప్తే వేరు అనుకునే వారు ఎందరో! అలా అనుకునేవారిలో భారతీయులు అందరి కంటే ముందున్నారు. 2017లో ఏకంగా 4.6 లక్షల కోట్ల రూపాయలను ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపారు. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 9.9 శాతం ఎక్కువ. ప్రపంచ బ్యాంకు ఈ వివరాలు వెల్లడించింది. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారతీయులు స్వదేశానికి పంపుతున్న మొత్తమే ఎక్కువగా ఉందని తేల్చింది. భారతీయులు సామాజిక బాధ్యతతో మెలగడం వల్లే ఇది సాధ్యమైందని బ్యాంకు విశ్లేషించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com