బిగ్ బాస్‌2 లో ఛాన్స్..

- May 09, 2018 , by Maagulf
బిగ్ బాస్‌2 లో ఛాన్స్..

హిందీ, తమిళంలోనే కాకుండా దాదాపు 13 భాషల్లో క్లిక్ అయిన బిగ్ బాస్ తెలుగులో కూడా క్లిక్ అయింది. బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీజన్1 కి హోస్ట్‌గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ షోని ఆధ్యంతం రక్తి కట్టించి సక్సెస్ చేయండంలో ప్రధాన పాత్ర వహించారు. ఇక ఈ షోలో పాల్గొన్న సెలబ్రిటీలకు కూడా ఆ తరువాత మంచి అవకాశాలే వచ్చాయి. షో విన్నర్‌ బాలాజీ 50 లక్షలు ప్రైజ్‌మనీ దక్కించుకుని విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. మరి అదే ఊపుతో సీజన్ టూ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈసారి మరికొన్ని మార్పులు చేర్పులు చేశారు. మరింత ఆకర్షణీయంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. షోకి వ్యాఖ్యాతగా నేచురల్ స్టార్ నానీ అలరించబోతున్నాడు. సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా పాల్గొనవచ్చని షో నిర్వాహకులు తెలియజేస్తున్నారు. సీజన్2 కి ఆడిషన్స్ మొదలైనట్లు ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రోమోలో దీక్షాపంథ్ స్టూడెంట్స్‌కి పాఠాలు చెబుతుంటుంది. తన హాట్ లుక్స్ మరియు హస్కీ వాయిస్‌తో అలరిస్తుంది. బిగ్‌బాస్ షోకి సామాన్యులకు స్వాగతం అంటూ ఓ వాయిస్ వినిపిస్తుంది. అంటే బిగ్‌బాస్ హౌస్ సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా సందడి చేయబోతున్నారన్నమాట. మరికెందుకు ఆలస్యం మీరూ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com