పెరుగుతో పొందే ప్రయోజనాలు..
- December 06, 2015
రకరకాల వంటకాలతో విందు భోజనం నోరూరించినా.. ఒక ముద్ద పెరుగన్నం లేకపోతే.. సంతృప్తి ఉండదు. ఏది తినాలనిపించకపోయినా.. కాస్త పెరుగన్నం తినడం వల్ల పొందే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అయితే .కొంతమంది పెరుగును చూస్తే ఆమడ దూరం పారిపోతుంటారు. కానీ.. పెరుగులో ఉన్న పోషకవిలువలు, ప్రయోజనాలు తెలుసుకుంటే.. మీకే పెరుగు తినాలి అనిపిస్తుంది. శరీరానికి శక్తినిచ్చే ఆహార పదార్థాల్లో పెరుగు ప్రధానమైనది. ఒకపూట భోజనానికి సమానమయ్యే పెరుగన్నం రెండున్నర గంటల వరకు ఆకలిని అదుపులో ఉంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ కప్పు పెరుగు తీసుకుని మీ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోండి. పెరుగు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.. శాఖహార భోజనంలో పెరుగు కీలకం. 89 శాతానికి పైగా నీటిని కలిగి ఉండే పెరుగులో నాణ్యమైన ప్రోటీన్లు, దాదాపు అన్ని రకాల ఎమినో యాసిడ్లు, కాల్షియం తగినస్థాయిలో లభిస్తాయి. కాబట్టి నిత్యం పెరుగును తీసుకోవడం మానకండి. ఆహారం జీర్ణం కావడానికి పెరుగు తోడ్పడుతుంది. ఇందులో ఉన్న పోషకాలు జీర్ణవ్యవస్థ పనితీరుకు సహకరిస్తాయి. పెరుగులో శరీరానికి మేలుచేసే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. శరీరానికి చెడుచేసే బ్యాక్టీరియాను నివారిస్తుంది. పెరుగులో క్యాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను, పళ్లను బలంగా ఉంచుతాయి. కాబట్టి నిత్యం పెరుగు తీసుకుంటే.. ఎముకల ఆరోగ్యానికి మంచిది. పెరుగు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే పెరుగుకి రక్తపోటుని అదుపులో ఉంచే శక్తి ఉంటుంది. రక్తనాళాల్లో, శరీరంలో కొవ్వు చేరకుండా నివారించే శక్తి పెరుగుకు ఉంటుంది. బరువు తగ్గించడంలో పెరుగు బాగా తోడ్పడుతుంది. పెరుగులో ఉన్న క్యాల్షియం శరీరంలో కార్టిసాల్ అనే స్టిరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రణలో ఉంచుతుంది. ఈ కార్టిసాల్ ఉత్పత్తి ఎక్కువైనా, సమతౌల్యం కోల్పోయినా జీవనశైలికి సంబంధించిన వ్యాధులు హైపర్ టెన్షన్, ఒబెసిటీ లాంటివి వస్తాయి. అలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే రోజూ డైట్ లో పెరుగు ఉండాల్సిందే. పెరుగులో ఉండే విటమిన్ సి, జింక్, క్యాల్షియం జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులో ఉన్న యాంటీ ఫంగల్ గుణాలున్న లాక్టిక్ యాసిడ్ కురుల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పెరుగును తలకు అప్లై చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. కొంతమందికి పాలు, పాల వాసన అంటే సరిపోవు. ఇలాంటివారికి పాలలో ఉన్న లాక్టోజ్ ప్రొటీన్ అందదు. కాబట్టి పెరుగునైనా తీసుకుంటే లాక్టోజ్ని లాక్టిక్ ఆసిడ్ రూపంలో పొందవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా అవసరం. పెరుగు తింటే.. పొట్టలో చల్లగా ఉండటమే కాదు.. మెదుడును ప్రశాంతంగా ఉంచుతుంది. ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. మొలల సమస్యతో బాధపడేవాళ్లకు పెరుగు చక్కటి పరిష్కారం. నిత్యం పెరుగన్నం తీసుకుంటే.. పైల్స్ ను అరికడుతుంది. పెరుగన్నానికి కాస్త అల్లం జోడించి తింటే మంచి ఫలితం ఉంటుంది.
తాజా వార్తలు
- లోక్‌సభలో పలు బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్‌లో కొత్త AI సెంటర్‌తో 3,000 ఉద్యోగాలు..
- పేదలకు అండగా కూటమి ప్రభుత్వం: కొల్లు రవీంద్ర
- ఒమన్ చేరిన తొలి చైనా ఫ్లైట్..!!
- లైసెన్స్ లేని నర్సరీ ఆపరేటర్‌కు మూడు నెలల జైలు శిక్ష..!!
- ఈద్ అల్ ఎతిహాద్..ఉచిత 54GB డేటా..స్పెషల్ ఆఫర్లు..!!
- రెండు సౌదీ ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం..!!
- గవర్నరేట్లలో మునిసిపాలిటీ తనిఖీలు ముమ్మరం..!!
- డిసెంబర్లో శీతాకాలం ప్రారంభం..ఖతార్ మెట్
- విశాఖ–రాయపూర్ ఎక్స్‌ప్రెస్‌వే







