32 మందికి పైగా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు హతం..
- December 07, 2015
సిరియాపై.. యూఎస్ ఆధ్వర్యంలోని సంకీర్ణ దళాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై ఆదివారం జరిపిన భీకరదాడుల్లో 32 మందికి పైగా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు హతమయ్యారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. సిరియాలో గత ఆరు రోజులుగా కొనసాగుతున్న వైమానికి దాడులు రఖ్వా ప్రావిన్స్ లో భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. సిరియాలో ఉత్తర, తూర్పు ప్రాంతాలలో తలదాచుకున్న జిహాదీలను మట్టుపెట్టే లక్ష్యంతో సంకీర్ణ దళాలు భీకరమైన పేలుళ్లకు పాల్పడుతోంది. ఉగ్రవాద సంస్థ స్థావరాలను ధ్వంసం చేస్తోంది. కాగా ఇటీవల దాడుల నేపథ్యలో ఐఎస్ఎస్ ఉగ్రవాదులు.. రఖా వైపుకు పారిపోతున్నట్టు వార్తల నేపథ్యంలో రఖా టార్గెట్ గా దాడులకు దిగింది. ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్ దేశాలు సిరియాపై భీకరంగా వైమానిక దాడులు చేస్తున్నాయి. పారిస్ ఉగ్రదాడి ఘటన తర్వాత ఆ దాడులను మరింత ముమ్మరం చేశాయి.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







