అణు ప్రయోగ కేంద్రం తొలగింపు..ఉ.కొరియా ప్రకటన
- May 13, 2018
పాంగ్యాంగ్: తాము అణు ప్రయోగాలు నిర్వహించే అణు ప్రయోగ కేంద్రాన్ని ఈ నెల 23-25 తేదీల మధ్యలో తొలగించనున్నట్లు ఉ.కొరియా శనివారం ప్రకటించింది. కొరియా ద్వీపకల్పాన్ని అణు నిరాయుధీకరణ చేసే ప్రక్రియలో భాగంగా తాము ముందడుగు వేస్తున్నామని, తొలగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని ఉ.కొరియా విదేశాంగశాఖను ఉటంకిస్తూ అధికార వార్తా సంస్థ సనా ఒక వార్తా కథనంలోవెల్లడించింది. ఇటీవల జరిగిన అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా (డబ్ల్యుపికె) ఏడవ కేంద్ర కమిటీ మూడో ప్లీనరీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కొరియా అణ్వాయుధ సంస్థ, ఇతర సంబంధిత సంస్థల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ మంత్రిత్వశాఖ తన ప్రకటనలో తెలియచేసింది.
తాజా వార్తలు
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!







