ఒమన్‌ - యూఏఈ కొత్త రోడ్‌ బోర్డర్‌ క్రాసింగ్‌

- May 13, 2018 , by Maagulf
ఒమన్‌ - యూఏఈ కొత్త రోడ్‌ బోర్డర్‌ క్రాసింగ్‌

మస్కట్‌: ది సారా బోర్డర్‌ పాయింట్‌ మంగళవారం ప్రారంభం కానుందని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించారు. అల్‌ బురైమిలో ఏర్పాటు చేసిన ఈ రోడ్‌ బోర్డర్‌ క్రాసింగ్‌ మే 15న ప్రారంభిస్తామని, ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌ ఛైర్మన్‌ డ్టార్‌ సైద్‌ అల్‌ కాబి, పోలీస్‌ అండ్‌ కస్టమ్స్‌ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ మేజర్‌ జనరల్‌ హమాస్‌ అల్‌ హతామి పలువురు ప్రముఖులు, సీనియర్‌ అధికారులు, షేక్స్‌, పౌరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com