11 కార్ల దహనం: నిందితుడి అరెస్ట్
- May 13, 2018
దుబాయ్‌లోని ఓ షాపింగ్ మాల్ యెదుట 11 వాహనాలు ధ్వంసమయిన ఘటనలో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. ఉద్దేశ్యపూర్వకంగానే వాహనాలకు నిందితుడు నిప్పు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దుబాయ్ ఔట్లెట్ మాల్ యెదురుగా ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. నిందితుడు, స్టాఫ్ మెంబర్స్‌ని షాపింగ్ మాల్కి తరలించే డ్రైవర్. సహచరులతో వాగ్యుద్ధం అనంతరం నిందితుడు వాహనాన్ని తగలబెట్టాడు. ఈ క్రమంలో ఆ మంటలు మరో 10 కార్లకు వ్యాపించాయి. విచారణలో తొలుత దగ్ధమైన కారుని గుర్తించి, ఆరా తీయగా ఆ కారులో ఎలాంటి ఫ్లేమబుల్ ఐటమ్స్ లేవని నిర్ధారించి, నిందితుడ్ని అనుమానించారు. విచారణలో నిందితుడు, తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడికీ ఈ ఘటనలో స్వల్పంగా గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







