15 ఏళ్ళ బాలుడికి లైంగిక వేధింపులు
- May 13, 2018
దుబాయ్ బీచ్‌లో ఓ వ్యక్తి, 15 ఏళ్ళ బాలుడ్ని లైంగికంగా వేధించిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో నిందితుడిపై కేసు నమోదయ్యింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ రికార్డ్స్ ప్రకారం 27 ఏళ్ళ పాకిస్తానీ వ్యక్తి, 15 ఏళ్ళ కిర్గిస్తానీ బాలుడ్ని జుమైరా బీచ్‌లో లైంగికంగా వేధించాడు. లైంగిక వాంఛతో బాలుడ్ని తాకుతూ, అసభ్యకరంగా ప్రవర్తించాడు నిందితుడు. అయితే నిందితుడు తనపై వస్తున్న అభియోగాల్ని ఖండిస్తున్నాడు. బాలుడి తల్లి మాత్రం, తన కుమారుడ్ని నిందితుడు అసభ్యకరంగా తాకాడని చెబుతోంది. అయితే నిందితుడు మాత్రం అనుకోకుండా, బాలుడి ఛాతిపై తన చేయి తగిలిందని వాదిస్తున్నాడు. ఈ కేసులో తదుపరి విచారణ మే 27కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







