మరో రెండురోజులు పాటు ధూళి తుఫాను
- May 13, 2018
న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలలో, దక్షిణాది ప్రాంతాలలో మరో రెండురోజులు పాటు ధూళి తుఫాను, పిడుగులు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం తుఫాను ధాటికి నాలుగురాష్ట్రాలలో 41మంది మృతిచెందగా,చాలా మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. పశ్చిమబెంగాల్లో చిన్న పిల్లలతో సహా 12మంది మృతిచెందారు. భారీ ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు కూలి విద్యుత్ తీగలపై పడటంతో, విద్యుత్‌కు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో 70 విమానాలు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ, శివారు ప్రాంతాలలో వాతావరణం అనుకూలించకపోవడంతో పలు రైలు, మెట్రో సేవలు నిలిచిపోయినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్‌పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!







