పాలస్తీనాలో చెలరేగిన హింస.. 52 మంది దుర్మరణం

- May 14, 2018 , by Maagulf
పాలస్తీనాలో చెలరేగిన హింస.. 52 మంది దుర్మరణం

తీవ్ర ఉద్రిక్తతలు, భారీ హింసాత్మక ఘటనల మధ్య ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని సోమవారం టెల్‌ అవీవ్‌ నుంచి జెరూసలెంకు మార్చారు. ఈ సందర్భంగా పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో పెద్ద ఎత్తున హింస చోటుచేసుకుంది. జెరూసలెంలో అమెరికా రాయబార కార్యాలయం ప్రారంభాన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీయులు జరిపిన నిరసన ప్రదర్శనలు రక్తసిక్తమయ్యాయి. సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన వేలాది మందిపై ఇజ్రాయెల్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌ భయంకరమైన మారణహోమానికి పాల్పడిందని పాలస్తీనా అధ్యక్షుడు మహమద్‌ అబ్బాస్‌ ఆరోపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com