'మహానటి' చూడాలని ఉంది - బాలీవుడ్ నటి రేఖ
- May 15, 2018
మహానటి సినిమా తరవాత అనేక ఆసక్తి కరమైన నాటి విషయాలు ఈ తరం యువతకు తెలుస్తున్నాయి. సావిత్రి జీవిత కథలో, సావిత్రి పాత్రను కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 9 (బుధవారం)న విడుదలై ఘన విజయం సాధించింది. సినిమాకు ప్రముఖులే కాదు ప్రజలనుండీ అందరి ప్రశంసలు అందుతున్నాయి. అయితే మరి ఆ కుటుంబ సభ్యులకు కూడా అలాగే అందరిని మించిన ఆత్రుత ఉంటుంది కదా! అయితే మహనటి సినిమాను చూడాలని ఉందని జెమిని గణేషన్ తో సహజీవనం చేసిన సినీనటి పుష్పవల్లి (జెమిని జీవితం లో జనానికి తెలిసిన రెండవ భార్య వివాహం చేసుకున్న వివరాలు తెలియదు) కుమార్తే బాలీవుడ్ ప్రఖ్యాత సీనియర్ నటి రేఖ అన్నారు.
ఇది తన పిన్ని కథ అని, తన తండ్రి గురించి కూడా సినిమాలో ఉందని, అందుకే సినిమా చూడాలని కొరుకుంటున్నాని చెప్పుకొచ్చింది. నాన్న ఙ్జాపకాలు నెమఱువేసుకునే అవకాశం కలుగుతున్ దన్నారు. మొదట తన సవతితల్లి సావిత్రి జీవితకథపై తనకు చాలా అనుమానాలు ఉన్నాయని, తన తండ్రి గురించి ఎక్కడ చేడుగా చూపిస్తా రనే భయం తనకు ఉండేదని చేప్పిందట రేఖ. తరువాత కొంతకాలం ఆగి చూద్ధామనుకుందట. అందుకే కొంతకాలం నిశ్శబ్ధంగా ఉండిపోవాలనుకుందట. ఇప్పుడు మళ్లీ సినిమా చూడాలని ఉందని ఆమె ముంబై లో పబ్లిక్ స్టేట్ మెంట్ ఇచ్చింది.
ఇప్పుడు ఈ సినిమా విడుదలైన తర్వాత తన స్వంత సోదరి రాధ ద్వారా సినిమా చూడాలని ఉందని నిర్మాతలకు రేఖ తెలియజేసిందని సమాచారం. జీవితం విషయం లో రెఖ జీవిత చరిత్ర మహానటికి ఏమాత్రం తీసిపోదు. నటనలో కూడా రేఖ హిమోన్నతమే. జీవితమంతా ఒడిదుడుకులు బాల్యం అనిశ్చితం. వృత్తిలో మలుపులనేకం జీవితంలో కూడా అంతే. బయోపిక్ తీస్తే ఈమె జీవితం కూడా మహనటిని మించిన గొప్ప చిత్రంగా రూపొందించ వచ్చంటారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..