దిల్ రాజు "సాక్ష్యం" సినిమా
- May 19, 2018
"అల్లుడు శీను, జయ జానకి నాయక" లాంటి మాస్ సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైనమిక్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా "సాక్ష్యం". బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం జూన్ 14 న రిలీజ్ చేయబోతున్నారు.
ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడం తో ఈ సినిమా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. కానీ ఆ రైట్స్ ఎంత మొత్తం అన్నది మాత్రం తెలియదు. బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: హర్షవర్ధన్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







