క్యూబాలో ఘోర విమానం ప్రమాదం..
- May 18, 2018
క్యూబా:క్యూబాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 113 మంది మృత్యువాతపడ్డారు. హవానాలోని జోస్‌మార్టి ఎయిర్ పోర్ట్ నుంచి శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో టేకాఫ్ తీసుకున్న బోయింగ్ 737 ఫ్లైట్ కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు 9 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 113 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు.
క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్ కేనెల్ ప్రమాద స్థలాన్ని సందర్శించి.. సంతాపం తెలిపారు. చాలామందిని అంబులెన్సుల్లో తీసుకెళ్లడం చూశామని సంఘటన స్థలం వద్ద ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. గాయపడినవారిని హస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
కాగా, ప్రయాణికులు పూర్తిగా కాలిపోవడంతో మృతులను అధికారులు గుర్తించలేకపోతున్నారు. ప్రమాదానికి గురైన బోయింగ్ 737-201 విమానం 1979లో తయారైంది. దాన్ని క్యూబన్ ఎయిర్‌లైన్స్ అద్దెకు తీసుకుని నడుపుతుందని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







