పెట్టుబడిదారులకు 100 శాతం యాజమాన్యం ఇవ్వనున్న దుబాయ్ ప్రభుత్వం
- May 21, 2018
దుబాయ్: గల్ఫ్ దేశం యూఏఈలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారితోపాటు ప్రత్యేక నైపుణ్యంతో కలిగి వ్యక్తులకు అక్కడి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 10 సంవత్సరాల వరకూ యూఏఈలో నివసించడానికి అనుమతినిస్తూ వీసాను మంజూరు చేస్తామని ప్రకటించింది. పెట్టుబడిదారులు, నైపుణ్యం కలిగిన వైద్యులు, ఇంజనీర్ల, పరిశోధకులకు ప్రతిపాదిత వీసాలు లభించనున్నాయి. ఆయా వ్యక్తుల కుటుంబ సభ్యులు కూడా యూఏఈ ఉండేందుకు వీసా వెసులుబాటును కల్పించనున్నారు. అత్యుత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులకు కూడా 5 సంవత్సరాల వరకు నివసించే వీసాను మంజూరు చేయనున్నారు. అవసరాన్ని పొడగించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని యూఏఈ ఉపాధ్యక్షుడు, దేశ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తుమ్ ఆదివారం ప్రకటించారు.
100 శాతం యాజమాన్యం
యూఏఈలో కంపెనీలు స్థాపించిన యజమానులకు ఆయా కంపెనీలపై 100 శాతం యాజమాన్య హక్కులు లభిస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. యూఏఈ ప్రధాని చేసిన ఈ ప్రకటన పట్ల హర్షం వ్యక్తమవుతోంది. పలువురు పెట్టుబడిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడుదారులు వారి కుటుంబ సభ్యులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







