ఫేక్‌ బాంబ్‌: అన్నదమ్ములకు జైలు

ఫేక్‌ బాంబ్‌: అన్నదమ్ములకు జైలు

మనామా: హై క్రిమినల్‌ కోర్ట్‌ ఇద్దరు అన్నదమ్ములకు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఫేక్‌ బాంబ్‌ని ప్లాంట్‌ చేయడం ద్వారా పబ్లిక్‌ పీస్‌ని దెబ్బతీసేందుకు వీరు ప్రయత్నించినట్లు అభియోగాలు నిరూపించబడ్డాయి. జైలు శిక్షతోపాటు, వీరి పౌరసత్వాన్ని కూడా రద్దు చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వీరిపై తీవ్రవాద నేరాభియోగాలు మోపబడ్డాయి. రద్దీగా వుండే ప్రాంతంలో బాంబుని పోలి వుండే వస్తువుని వీరు వుంచగా, భయపడ్డ స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాంబ్‌ ఎక్స్‌పర్ట్స్‌తో ఆ వస్తువుని పరీక్షింపజేసి, దాన్ని ఫేక్‌ బాంబుగా తేల్చారు. ఆ వస్తువు నుంచి ఫింగర్‌ ప్రింట్స్‌ సేకరించగా, అవి నిందితుడి ఫింగర్‌ ప్రింట్స్‌తో సరిపోయాయి. ఈ కేసులో ఇంకో వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. 

Back to Top