ఉదయం బ్లాక్ కాఫీ- మధ్యాహ్నం గ్రీన్ టీ తాగితే?
- May 25, 2018
ఉదయం పూట ఓ కప్పు బ్లాక్ కాఫీ.. మధ్యాహ్నం ఆహారం తీసుకునేందుకు అరగంట ముందు గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఆర్గానిక్ కాఫీ పొడులతో తయారు చేసే బ్లాక్ కాఫీని తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది.
ఉదయం పూట బ్లాక్ కాఫీ తీసుకోవడం ద్వారా రోజంతా చురుకుగా వుండగలుగుతారు. ఉదయం ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్ కాఫీ తీసుకోవడం ద్వారా శరీర బరువు పెరగకుండా నియంత్రించుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం పూట గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా ఆహారాన్ని మితంగా తీసుకోగలుగుతారు. తద్వారా ఒబిసిటీ దరి చేరదు.
అలాగే ప్రతిరోజు రెండు లేదా మూడు కప్పుల బ్లాక్ కాఫీ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దెమెంతియా, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులు రాకుండా ఉండడంతో పాటు మెదడు చురుగ్గా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. బ్లాక్ కాఫీ వల్ల రక్తంలోకి అడ్రినలిన్ విడుదలవుతుందని, దీంతో కొవ్వు కరుగుతుంది. అలాగే, లివర్ కేన్సర్, హెపటైటిస్ వంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చునని తాజా అధ్యయనంలో తేలింది.
ప్రతిరోజు కాఫీ తాగితే శరీర మెటబాలిజం యాభై శాతం వరకు పెరుగుతుంది. ప్రతిరోజు రెండు కప్పుల కంటే ఎక్కువగా బ్లాక్ కాఫీ తాగితే శరీరంలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయి డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా వుంటాయని పరిశోధకులు అంటున్నారు. అంతేగాకుండా, బ్లాక్ కాఫీ తాగితే ఒత్తిడికి కూడా దూరంగా ఉండొచ్చనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం బ్లాక్ కాఫీని తీసుకోకపోవడం మంచిదని వారు సలహా ఇస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!