'అమ్మమ్మ గారి ఇల్లు' రివ్యూ

- May 25, 2018 , by Maagulf
'అమ్మమ్మ గారి ఇల్లు' రివ్యూ

నటీనటులు : నాగ శౌర్య , షామిలి ,రావు రమేష్
దర్శకత్వం : సుందర్ సూర్య
నిర్మాత : రాజేష్
సంగీతం : కళ్యాణ రమణ
సినిమాటోగ్రఫర్ : రసూల్ ఎల్లోర్
ఎడిటర్ : జె.పి

నాగశౌర్య యూత్ ని ఆకట్టుకునే హీరో.. ఛలో తో యూత్ కి మరింత దగ్గరయిన నాగశౌర్య  అమ్మమ్మగారి ఇల్లు తో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. షామిలి మరో ఎట్రాక్టివ్ ఎలిమెంట్ గా మారిన అమ్మమ్మగారి ఇల్లు ఎలా ఉందో చూద్దాం...
కథ :
సంతోష్ (నాగశౌర్య) అందరూ బాగుండాలని కోరుకునే అబ్బాయి.  మావయ్య ( రావు రమేష్ ) తో ఆస్థి పంపకంలో జరిగిన గొడవలు కారణంగా ఇరవై యేళ్ళగా సంతోష్ అమ్మమ్మగారి ఇంటికి దూరం అవుతాడు.   ఆ గొడవలు కారణంగా అమ్మమ్మ ఇంటికి ఆమె కొడుకులు కూతురు కూడా దూరంగా ఉంటారు. ఆస్థిని పంచాలని తన బిడ్డలను తన దగ్గరకు పిలుస్తుంది.  అమ్మమ్మ మనసు తెలిసిన సంతోష్ ఆ కుంటుంబాన్ని కలపాలనుకుంటాడు. అనుబంధాలను మర్చిపోయి ఆస్థికోసం వచ్చిన వారిని అతను ఎలా కలిపాడు అనేది మిగిలిన కథ
కథనం:
నాగశౌర్య కు ఉండే పక్కింటి అబ్బాయి ఇమేజ్ ఈ కథకు బాగా కలసి వచ్చింది.  చాలా ఈజీగా గా పలికే ఎమోషన్స్ తో నాగశౌర్య తన పాత్రకు న్యాయం చేసాడు. ముఖ్యంగా ఇందులో మాటలు బాగున్నాయి. ‘నేను అమ్మనై పుట్టాను.. ఆస్థినై పుట్టినా అందరూ పంచుకునే వారు’ లాంటి మాటలు  తేలికైన అనుబంధాలను గుర్తు చేస్తాయి.  జీవితంలో దేనికోసం దేనిని వదిలేస్తున్నామనే కాన్సెప్ట్ తో వచ్చిన కథలలో అమ్మమ్మగారి ఇల్లు ప్రత్యేకంగా కనబడుతుంది. ఇందులో తెచ్చిపెట్టిన ఎమోషన్స్ ఎక్కడా కనపబడవు..సినిమా చూస్తున్నాం అనే భావన కలుగ కుండా భావోద్వేగాలను చాలా సహాజంగా తెరకెక్కించడంలో దర్శకుడు సుందర్ సూర్య సక్సెస్ అయ్యాడు. మాటలు చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి.  రావు రమేష్ పాత్ర ను చాలా చక్కగా డిజైన్ చేసుకున్నాడు. అతని పాత్ర వెటకారం, గోదారి జిల్లాల్లో కనపడే బాడీ లాంగ్వేజ్ ని ఒడిసి పట్టుకొని పెద్ద మావయ్య పాత్రకు ప్రాణ పోసాడు.  ఆస్థి కోసం వచ్చిన వారికి అనుబంధాలను గుర్తు చేయాలనుకున్నప్పుడు హీరో చేసిన ప్రతి పని కూడా ఆకట్టుకుంటుంది. ఇంట్లో ఏదో శుభకార్యం జరిగితే తన కూతురికి బంగారు గాజులు పెడుతుంది. అయితే అవి నిజమైన బంగారమా అని చెక్ చేయిస్తుంది కూతురు. ఆవిషయాన్ని గుర్తు చేస్తూ తన అత్తని హీరో కన్వెన్స్ చేసే సీన్ చాలా బాగుంది. ఫ్యామిలీ సినిమాలు తీయాలంటే ఆ ఎమోషన్స్ పేపర్ మీద పెట్టడం తేలిక తెరమీదకు తీసుకురావడం కష్టం అయితే దర్శకుడు కొత్త వాడయినా ఎమోషన్స్ ని తెరమీదకు తీసుకు రావడంలో సక్సస్ అయ్యాడు. ఇక అల్లరిగా కనిపించే పాత్రలో షామిలి ఆకట్టుకుంది. నాగశౌర్య పక్కన జోడీగా బాగుంది. కథ, కథనాలను కూడా కాన్సెప్ట్ నుండి బయటకు రానీయకుండా చేసాడు దర్శకుడు . ఇక రావు రమేష్, షకలక శంకర్ పాత్రలు ఈ సినిమాకు అండగా నిలిచాయి. ఆద్యతం నవ్వులు పండించే పాత్రలో షకలకశంకర్ మెప్పించాడు. తను నవ్వకుండా ఆడియన్స్ ని నవ్వించడంలో రావు రమేష్ సక్సెస్ అయ్యాడు. నాగశౌర్య కథను నడింపిచినా, ఆడియన్స్ ని మెప్పించడంలో ఈ పాత్రలు ముందున్నాయి. ఒక రకమైన ఎమోషన్ రిపీట్ అయ్యే సరికి ఆడియన్స్ కి సెకండాఫ్ లో కొత్తదనం దొరకలేదు. ఈ సీజన్ కి ఫరెఫెక్ట్ యాప్ట్ గా అనిపించే  కథనంతో ‘ అమ్మమ్మగారి ఇల్లు ’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
 చివరిగా:
అమ్మమ్మగారి ఇల్లు అనుబంధాలను గుర్తు చేస్తుంది. హాయిగా నవ్వింస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com