ఘనంగా ప్రారంభమైన మహానాడు
- May 27, 2018
తెలుగుదేశం పార్టీ కార్య కర్తలు , నేతలు ఎంతో ఘనంగా జరుపుకునే మహానాడు వేడుక ఈరోజు విజయవాడలోని కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం నుంచి మూడురోజుల పాటు ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర ప్రాంతాలనుండి కూడా భారీగా కార్య కర్తలు , అభిమానులు చేరుకున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు జరిగే చివరి మహానాడు ఇదే కావడంతో ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించనుంది.
మహానాడు ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు డ్వాక్రా బజార్, ఫోటో ప్రదర్శన ప్రారంభించి.. తిలకించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి.. రక్తదాతలను అభినందించారు.మహానాడులో మొత్తం 36 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. వివిధ అంశాల్లో కేంద్రం వైఖరిని ఖండించేందుకే ప్రత్యేకంగా నాలుగు తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. మహానాడు సందర్భంగా విజయవాడ నగరం అంత పసుపు మాయంగా మారింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







