టర్కీ: తెలంగాణ లేబర్ డిపార్ట్‌మెంట్ పీఎస్ శశాంక్ కొడుకు హత్య

- May 28, 2018 , by Maagulf
టర్కీ: తెలంగాణ లేబర్ డిపార్ట్‌మెంట్ పీఎస్ శశాంక్ కొడుకు హత్య

ఇస్తాంబుల్: సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ లేబర్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ గోయల్ కొడుకు శుభమ్ గోయల్(24) టర్కీలోని ఇస్తాంబుల్‌లో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మే 24న జరిగింది. దోపిడీ దొంగలు శుభమ్‌ను గన్‌తో కాల్చి చంపారు.

శుభమ్ అంత్యక్రియలు ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఆదివారం పూర్తయ్యాయి. కుమారుడి హత్య గురించి తెలిసిన వెంటనే శశాంక్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అక్కడ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో మాట్లాడి తన కొడుకు మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు ఏర్పాటు చేశారు. గత శనివారం శుభమ్ డెడ్‌బాడీ ఢిల్లీకి చేరుకోగా.. వెంటనే అక్కడి నుంచి శశాంక్ స్వగ్రామం రూర్కీకి తరలించారు.

యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శుభమ్ ఫ్రెండ్‌తో హాలీడే ట్రిప్ కోసం ఇస్తాంబుల్ వెళ్లాడు. అక్కడ దోపిడీ దొంగలకు వీళ్లు ఎదురుపడ్డారు. దీంతో శుభమ్, అతడి ఫ్రెండ్ సుభన్షును దొంగలు వాళ్ల దగ్గర ఉన్న డబ్బులు, నగలు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. శుభమ్ గోయల్ తమ దగ్గర ఉన్న డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో అతడిపై దాడి చేసిన దొంగలు ముందుగా కత్తితో పోడిచి అనంతరం గన్‌తో కాల్చి చంపారు.

"ఏప్రిల్ 28న బంధువుల పెండ్లికి శుభమ్ హాజరయ్యాడు. తర్వాత యూఎస్‌లోని కాలిఫోర్నియాకు శుభమ్ వెళ్లాల్సి ఉంది. ప్రయాణం వాయిదా పడటంతో శుభమ్, అతడి ఫ్రెండ్ సుభన్షు కలిసి టర్కీ ట్రిప్పుకు బయలుదేరారు. కాని.. ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది" అని శుభమ్ తాత డీబీ గోయల్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com