టర్కీ: తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ పీఎస్ శశాంక్ కొడుకు హత్య
- May 28, 2018
ఇస్తాంబుల్: సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ గోయల్ కొడుకు శుభమ్ గోయల్(24) టర్కీలోని ఇస్తాంబుల్‌లో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మే 24న జరిగింది. దోపిడీ దొంగలు శుభమ్‌ను గన్‌తో కాల్చి చంపారు.
శుభమ్ అంత్యక్రియలు ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఆదివారం పూర్తయ్యాయి. కుమారుడి హత్య గురించి తెలిసిన వెంటనే శశాంక్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అక్కడ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో మాట్లాడి తన కొడుకు మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు ఏర్పాటు చేశారు. గత శనివారం శుభమ్ డెడ్‌బాడీ ఢిల్లీకి చేరుకోగా.. వెంటనే అక్కడి నుంచి శశాంక్ స్వగ్రామం రూర్కీకి తరలించారు.
యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శుభమ్ ఫ్రెండ్‌తో హాలీడే ట్రిప్ కోసం ఇస్తాంబుల్ వెళ్లాడు. అక్కడ దోపిడీ దొంగలకు వీళ్లు ఎదురుపడ్డారు. దీంతో శుభమ్, అతడి ఫ్రెండ్ సుభన్షును దొంగలు వాళ్ల దగ్గర ఉన్న డబ్బులు, నగలు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. శుభమ్ గోయల్ తమ దగ్గర ఉన్న డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో అతడిపై దాడి చేసిన దొంగలు ముందుగా కత్తితో పోడిచి అనంతరం గన్‌తో కాల్చి చంపారు.
"ఏప్రిల్ 28న బంధువుల పెండ్లికి శుభమ్ హాజరయ్యాడు. తర్వాత యూఎస్‌లోని కాలిఫోర్నియాకు శుభమ్ వెళ్లాల్సి ఉంది. ప్రయాణం వాయిదా పడటంతో శుభమ్, అతడి ఫ్రెండ్ సుభన్షు కలిసి టర్కీ ట్రిప్పుకు బయలుదేరారు. కాని.. ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది" అని శుభమ్ తాత డీబీ గోయల్ తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







