తలైవా కు షాక్ ఇచ్చిన కర్ణాటక
- May 29, 2018
బెంగళూరు : కావేరీ నది జలాల వివాదంపై వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు రజినీకాంత్ కు కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ షాక్ ఇచ్చింది . రాజకీయ నాయకుడిగా మారిన ప్రముఖ సినీనటుడు రజినీకాంత్ తాజాగా నటించిన 'కాలా' చిత్రాన్ని కర్ణాటక రాష్ట్రంలో విడుదల చేయరాదని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. ఇప్పటికే ట్రైలరు విడుదలైన 'కాలా' చిత్రం జూన్ 7వతేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. కావేరీ నదీ జలాల వివాదంపై రజినీకాంత్ కర్ణాటక రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహరించిన నేపథ్యంలో ఆయన నటించిన 'కాలా' చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయకుండా చూడాలని కన్నడ సంఘాలు కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పై ఒత్తిడి తీసుకువచ్చాయి. దీంతో తాము 'కాలా' చిత్రాన్ని విడదల చేయకుండా నిషేధం విధించామని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గోవింద్ చెప్పారు. చిత్ర డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలతో చర్చించి 'కాలా'ను విడుదల చేయరాదని నిర్ణయించినట్లు గోవింద్ వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..