అన్నపూర్ణ స్టూడియోలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి
- May 31, 2018
హైదరాబాద్ : హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో పని చేస్తున్న నారాయణరెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన వయసు 53 ఏళ్లు. అయితే, ఆయన మృతదేహాన్ని స్టూడియో సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బంధువులకు సైతం సమాచారం ఇవ్వకుండా మృతదేహాని తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. నారాయణరెడ్డిని ఎవరైనా హత్య చేసి ఉంటారనే అనుమానాన్ని ఆయన బంధువులు వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు, ఉస్మానియా ఆసుపత్రి ఎదుట వారు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు, మరింత సమాచారం కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్లారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







