బహ్రెయిన్:చిన్నారిపై కన్నతల్లి పైశాచికత్వం
- June 01, 2018
బహ్రెయిన్:26 ఏళ్ళ అరబ్ మహిళ, తన 15 ఏళ్ళ కుమార్తెపై పైశాచికత్వం ప్రదర్శించింది. చిన్నారి కాళ్ళపైనా, అలాగే ప్రైవేట్ పార్ట్స్పైనా నిందితురాలు వాతలు పెట్టింది. తీవ్ర గాయాలతో చిన్నారి ఆసుపత్రి పాలయ్యింది. ఆసుపత్రిలో చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆ చిన్నారికి హెడ్ ఇంజ్యూరీ కూడా అయినట్లు పేర్కొన్నారు. నిందితురాలి భర్త, తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు, తల్లిపై కేసు నమోదు చేశారు. చిన్నారిపై తల్లి దాడికి సంబంధించి, ఆ చిన్నారి తండ్రి గతంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విచారణలో తేలింది. ఆ ఘటనలో చిన్నారి చేయి విరిగిపోగా, ప్రమాదవశాత్తూ కిందపడిపోయిందని తల్లి బుకాయించింది. తల్లి వేధింపుల కారణంగా ఆ చిన్నారి 10 శాతం డిజేబిలిటీకి గురయ్యింది. నిందితురాలికి తన భర్తతో ఏడేళ్ళ కుమారుడు కూడా వున్నాడు. అయితే ప్రమాదవశాత్తూ వేడి నీటిలో చిన్నారి పడిపోయిందంటూ నిందితురాలి తరఫు లాయర్ వాదనలు విన్పించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







