ఇరాన్‌పై యుద్ధం లేదని తేల్చేసిన ఖతర్ ఉపప్రధాని
- June 03, 2018
సింగపూర్:ఇరాన్‌తో ఎటువంటి శత్రుత్వాన్ని కొనసాగించదని ఖతర్ సీనియర్ ఉన్నతాధికారి ఆదివారం స్పష్టం చేశారు. సింగపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ భద్రత కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న రక్షణ శాఖ మంత్రి, ఉపప్రధాని ఖలీద్ ఎల్ అతియాహ్ మాట్లాడుతూ ఖతర్‌కు ఇరాన్‌తో చాలా విభేదాలు ఉన్నాయని, కానీ తమ దేశం యుద్ధానికి ఆజ్యం పోయదని తెలిపారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించడం వివేకమా అని ప్రశ్నించారు. ఇరాన్‌పై యుద్ధానికి మూడవ పక్షంగా ఉన్న కొన్ని దేశాలు ప్రేరేపిస్తున్నాయని, ఇది ఎంతో ప్రమాదకరమైనదని ఆయన ఆరోపించారు. ఇరాన్ తమకు సన్నిహిత మిత్ర దేశమని, శాంతి చర్చలపై పిలుస్తామని ఆయన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇరాన్‌పై వైమానిక దాడులను ప్రయోగించడానికి వైమానిక స్థావరాలను ఉపయోగిస్తారా అన్న ప్రశ్నకు తమ దేశం యుద్ధాన్ని ప్రేరేపించదని పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్,ఆప్గనిస్తాన్‌పై యుద్ధం చేయడానికి ఆల్ యుడిద్ ఎయిర్ బేస్‌లో 10వేల అమెరికా దళాలు ఖతర్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







