ఒమన్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించిన ఎన్టీఆర్ ట్రస్ట్
- June 04, 2018మస్కట్: ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమన్, బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ని మస్కట్‌లోని బౌషర్ బ్లడ్ బ్యాంక్‌లో నిర్వహించింది. ట్రస్ట్ సభ్యులు, వారి కుటుంబాలకు చెందినవారు, సన్నిహితులు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో ఉత్సాహంగా పాల్గొని, రక్తాన్ని అందించారు. పవిత్ర రమదాన్ మాసంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. 120 మంది వరకూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో రక్తాన్ని అందించడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమన్ కృతజ్ఞతలు తెలిపింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమన్ తొలిసారిగా ఒమన్‌లో, ఎన్టీఆర్ ట్రస్ట్ - హైద్రాబాద్‌తో కలిసి స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎన్టీఆర్ ట్రస్ట్ కేంద్ర కార్యాలయం, ఇండియాలోని హైద్రాబాద్‌లో వుంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు మీద ఈ ట్రస్ట్ పలు రకాలైన సేవల్ని అందిస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..