ఈ చిట్కాలు పాటిస్తే పిల్లల్లో ఆరోగ్యకరమైన ఎదుగుదల
- June 04, 2018
ప్రస్తుత కాలంలో చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలలో పెరుగుదల చాలా తక్కువుగా ఉంటుంది. ఈ పెరుగుదలకు వంశపారంపర్యం ఒక కారణం. అయితే మనం సరియైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల కూడా పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. టీనేజ్ సమయంలో పెరుగుదలకు సంబంధించిన హార్మోను ఎక్కువుగా విడుదలవుతుంది. ఈ సమయంలో మంచి పౌష్టికాహారం తీసుకోవటం వలన మంచి పెరుగుదల ఉంటుంది. ఆ ఆహార పదార్థాలు తెలుసుకుందాం.
1. ప్రతి రోజు ఒక గ్లాసు పాలలో కొద్దిగా బెల్లం, 5 మిరియాలు, అశ్వగంధ పొడి కలిపి రాత్రిపూట త్రాగాలి. ఇలా 3 నెలల పాటు క్రమంతప్పకుండా చేయటం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు.
2. గుమ్మడికాయను మెత్తగా ఉడకబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు దానికి కొంచెం పటికబెల్లం పొడిని, కొంచెం తేనెను కలిపి ప్రతిరోజు టిఫిన్ తినే సమయంలో రెండు స్పూన్ల చొప్పున తినటం వల్ల పొడవును పెంచే టిష్యూలను బిల్డప్ చేయటానికి మరియు కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
3. ఉసిరికాయను రోజూ తీసుకోవటం వల్ల ఎత్తు పెరగటానికి సహాయపడుతుంది. ఇందులో ఉన్న సి విటమిన్, ఫాస్పరస్, కాల్షియం, మినరల్స్ పొడవు పెరగటానికి తోడ్పడతాయి.
4. మనం రోజు వారి తీసుకునే ఆహారంలో బచ్చలికూర, క్యారెట్, బెండకాయ, సోయాబీన్స్ వంటివి చేర్చుకోవడం వల్ల ఎత్తు పెరగటానికి దోహదపడతాయి. వీటిలో ఫైబర్, కాల్షియం, ఐరన్ ఉండటం వలన ఇవి పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి.
5. ఎండిన అంజీర పండ్లు, జీలకర్ర, పటికబెల్లం తీసుకొని మెత్తగా పొడిచేసుకోవాలి. దీనిని సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు గ్లాసు పాలలో ఒకస్పూన్ పొడిని కలుపుకొని త్రాగటం వలన బాగా ఎత్తుగా పెరుగుతారు. ప్రతిరోజు వ్యాయామం చేయటం, సైకిల్ తొక్కటం, స్కిప్పింగ్ ఆడటం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







