'పంతం' టీజర్ విడుదల
- June 05, 2018
మాచో హీరో గోపిచంద్ ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.. కొన్నాళ్ళుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న గోపిచంద్ ప్రస్తుతం చక్రి దర్శకత్వంలో పంతం అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో మెహరీన్ కథానాయికగా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో గోపిచంద్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై భారీ ఆసక్తిని కలిగిస్తున్నాయి. సీరియస్ లుక్‌తో కనిపిస్తున్న గోపించంద్ పోలీస్ గెటప్‌లో రఫ్ఫాడిస్తున్నాడు . పంతం అనే టైటిల్‌కి ఫర్ ఏ కాజ్ అని ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ సినిమాతో తప్పక సక్సెస్ సాధించాలనే కసితో గోపిచంద్ ఉన్నాడు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా... ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. కెకె రాధామోహన్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. సామాజిక అంశాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. వచ్చే నెలలో సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







