57 మంది జవాన్లు మృతి ..
- December 09, 2015
ఈ ఏడాది ఉగ్రదాడుల్లో 57 మంది జవాన్లు మృతి సొంత వూళ్లను వదిలి సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు ఎందరో. కర్తవ్య నిర్వహణలో భాగంగా ఏటా పదుల మంది సైనికులు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలా.. గతేడాది డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాది నవంబర్ 30 వరకు ఉగ్రవాదులను అడ్డుకునే ప్రయత్నంలో 57మంది సైనికులు మృతిచెందారు. ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన సైనిక సిబ్బందిపై రక్షణశాఖ(స్వతంత్ర) మంత్రి ఇందర్‌జీత్‌సింగ్ రావు రాజ్యసభలో నివేదిక అందించారు. కేవలం జూన్, నవంబర్ మధ్య కాలంలోనే 38మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. దీంతో పాటు ఈ ఏడాది కాలంలో పొరుగు దేశమైన పాకిస్థాన్ 151 సార్లు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడినట్లు నివేదికలో పేర్కొన్నారు. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద జరిపిన కాల్పుల్లో ఆరుగురు సైనిక సిబ్బంది కూడా మృతిచెందారు.
తాజా వార్తలు
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సముద్ర గర్భంలో 500 ప్రాణాలు.. బంగాళాఖాతంలో ఘోర జలసమాధి..
- IRCTC సరికొత్త వెబ్సైట్ లాంచ్..
- మొగుడిని చంపి..కొడుకును పొడిచిన సైకో భార్య!
- పొరుగు దేశాలతో ఘర్షణ కోరుకోవడం లేదు..ఇరాన్ సైన్యం స్పష్టీకరణ
- జనం మధ్యకు జగన్నాథుడు
- భారత్ ఇకపై హార్ముజ్ జలసంధి పై ఆధారపడదు
- యూఏఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా..
- లంచం అడిగితే ఇవ్వం అని చెప్పండి: సీఎం విజయ్







