మిజోరాం:లోయలో పడిన బస్సు.. 11 మంది మృతి
- June 05, 2018
మిజోరాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం పంగ్జ్వాల్ గ్రామ సమీపంలో ఎత్తైన ప్రదేశంలో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. సుమారు 500 మీటర్ల పై నుండి బస్సు కిందపడిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ నిద్రపోతుండగా.. క్లీనర్ డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. బస్సు ఐజ్వాల్ నుండి సియాహ వెళ్తోందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







