విస్తారా ఎయిర్‌లైన్స్ వారి గ్రాండ్ సేల్
- June 05, 2018
విమానయాన సంస్థలు వరసపెట్టి మరీ డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి. బడ్జెట్ క్యారియర్ గో ఎయిర్ స్పెషల్ మాన్సూన్ ఆఫర్, జెట్ ఎయిర్వేస్ బిగ్ సేవింగ్స్ తరహాలోనే విస్తారా ఎయిర్‌లైన్స్ కూడా తాజా ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దేశీయ మార్గాల్లో విమాన టికెట్లపై 75 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. పరిమిత కాలం ఆఫర్‌గా ఇది ఈ రోజు(మంగళవారం) అర్ధరాత్రి నుండి 24 గంటలపాటు అందేబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.
తన మొత్తంలో నెట్‌వర్క్‌లో ఈ సేల్ పథకంలో భాగంగా టికెట్ ధరలపై 75శాతం తగ్గింపును అందించనుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా జూన్ 21నుంచి సెప్టెంబర్ 27 దాకా ప్రయాణానికి అనుమతి. ఢిల్లీ - లక్నో లాంటి చిన్నమార్గాల్లో రూ.1599 టికెట్ లభిస్తుండగా, ఢిల్లీ-హైదరాబాద్, ఢిల్లీ-రాంచీ మధ్య విమాన టికెట్లను రూ.2199కే ఆఫర్ చేస్తోంది.అలాగే ఢిల్లీ-కోలకతా, ఢిల్లీ-ముంబై టికెట్ ధర రూ.2,299 గా ఉండనుంది. కోలకతా- పోర్ట్ బ్లెయిర్ విమాన టిక్కెట్ల ధరలు 2,499 రూపాయలు, ఢిల్లీ-గోవా మధ్య రూ.2,799 ప్రారంభ ధరలుగా ఉంటాయని విస్తారా తెలిపింది. అన్ని చార్జీలను కలిపిన తరువాతే ఈ ధరలని ప్రకటించింది. కాగా దేశీయంగా 22 మార్గాల్లో 20 ఎయిర్‌బస్‌లు, ఎ320 విమానాలతో వారానికి 800 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది విస్తారా.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..