సౌదీ అరేబియా:భారతీయ చిత్రం'కాలా'రిలీజ్!
- June 07, 2018
సౌదీ అరేబియా:తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కాలా' చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అయితే రివ్యూలకు సంబంధం లేకుండా రజినీకాంత్ చిత్రాలు ఎక్కడైనా టాప్ లెవెల్లో దూసుకు పోతాయన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం రిలీజ్ కి ముందు నుంచి ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రం కథ మాదే అంటూ కోర్టుకు వెళ్లడం..కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని 'కాలా' రిలీజ్ కి పరిమిషన్ ఇవ్వడం జరిగింది. మరోవైపు కావేరీ జలాల వివాదంలో 'కాలా' చిత్రాన్ని కూడా లాగారు..కన్నడ నాట ఈ చిత్రాన్ని ప్రదర్శించవొద్దని వ్యతిరేకించారు.
ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకొని సినిమాలకు రాజకీయాలకు పొంత పెట్టవొద్దని..సినిమా రిలీజ్ కి ఎలాంటి అడ్డు తీసుకు రావొద్దని తీర్పు ఇచ్చింది. అంతే కాదు థియేటర్ల వద్ద సెక్యూరిటీ కూడా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే..సౌదీ అరేబియాలో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రం ఇదే కానుంది. నిజానికి 1980ల్లోనే సౌదీ అరేబియాలో సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు.
సినిమాల ప్రదర్శన ఇస్లాంలో జోక్యం చేసుకోవడమేనంటూ వచ్చిన ఒత్తిళ్లకు అక్కడి ప్రభుత్వం తలవొగ్గింది. 35 ఏళ్ల విరామం తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ లో తిరిగి అక్కడ సినిమా ప్రదర్శనలు మొదలయ్యాయి. మొదటి చిత్రంగా బ్లాక్ పాంథర్ విడుదలైంది. అయితే కర్ణాటకలో మాత్రం కాలా చిత్రానికి అడ్డు తగులుతూనే ఉన్నారు.
కాగా, సంప్రదాయవాదం ప్రబలంగా ఉన్న సౌదీ అరేబియాలో ప్రదర్శనకు వెళుతుండడం నిజంగా ఆలోచించతగినదే. దీనిపై రజనీకాంత్ అల్లుడు ధనుష్, కుమార్తె ఐశ్వర్య ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ''ఇది చాలా పెద్ద విషయం. సౌదీ అరేబియా రాజ్యంలో విడుదల అవుతున్న మొదటి భారతీయ సినిమా కాలా. ఇది కేవలం తలైవర్ కే సాధ్యం'' అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







